Mon Dec 23 2024 09:13:01 GMT+0000 (Coordinated Universal Time)
మరో 54 చైనా యాప్ లను నిషేధించిన భారత్
బ్యాన్ చేసిన యాప్ లలో అధిక యాప్ లు టెన్సెంట్, అలీబాబా, నెట్ ఈజ్ కంపెనీలకు చెందినవేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
చైనా యాప్ లపై భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝుళిపించింది. 2020లో టిక్ టాక్, హలో సహా 224 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం.. తాజాగా మరో 54 చైనా యాప్ లపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. చైనాకు చెందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్ డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఈఎన్టీ, ఐసోలాండ్-2 యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వీవా వీడియో ఎడిటర్, ఆన్ మైయోజీ చెస్, ఆన్ మై ఓజీ ఎరీనా, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లను నిషేధించినట్లు తెలిపాయి కేంద్ర వర్గాలు.
Also Read : కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్
బ్యాన్ చేసిన యాప్ లలో అధిక యాప్ లు టెన్సెంట్, అలీబాబా, నెట్ ఈజ్ కంపెనీలకు చెందినవేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. దేశ పౌరుల వ్యక్తిగత భద్రత, ప్రైవసీకి ఆయా యాప్ లు భంగం కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశ పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఆయా యాప్ ల ద్వారా సేకరించి, చైనాలో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించి, వాటిని బ్యాన్ చేశారు. ఐటీ యాక్ట్ 69ఏ ప్రకారం ఆయా యాప్ లపై నిషేధం విధించామని, ఇకపై ప్లే స్టోర్లలో కూడా ఈ యాప్ లు అందుబాటులో ఉండవని కేంద్ర వర్గాలు తెలిపాయి.
Next Story