ఆ సత్తా భారత్ కు ఉంది ...
సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చంద్రుడే కాదు.. మార్స్ (అంగారకుడు) వీనస్ (శుక్రగ్రహం) లపైకి వ్యోమనౌకలు పంపే సత్తా భారత్‌కు ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పారు
ఆ సత్తా భారత్ కు ఉంది ...
సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగం
చంద్రుడే కాదు.. మార్స్ (అంగారకుడు) వీనస్ (శుక్రగ్రహం) లపైకి వ్యోమనౌకలు పంపే సత్తా భారత్‌కు ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పారు. అయితే మరిన్ని పెట్టుబడులు, శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం, వారిపై విశ్వాసం అవసరమన్నారు. అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందాలని తద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలన్నదే ఇస్రో లక్ష్యం అని సోమనాథ్ చెప్పారు.
'ఆగస్టు 27న రోవర్ ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో భారీ గొయ్యి కనిపించింది. నాలుగు మీటర్ల వ్యాసంతో ఈ గొయ్యి ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్‌కు కమాండ్ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది' అని ఇస్రో(ISRO) వెల్లడించింది.
భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు పూర్తిగా సిద్ధమైందని ఇస్రో చీఫ్ తెలిపారు. అది శ్రీహరికోటకు చేరుకోగా, పిఎస్‌ఎల్‌వికి అనుసంధానించామని వివరించారు. ప్రయోగం తర్వాత, అది దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి వెళుతుంది. దాని నుంచి దాదాపు 120 రోజులు పట్టే L1 పాయింట్‌కి ప్రయాణిస్తుందని అన్నారు. దీనిని 400 కోట్ల రూపాయలతో రూపొందించామన్నారు. అంతరిక్షం నుంచి భగభగ మండే సూర్యుడిపై ఇది పరిశోధనలను చేస్తుంది. దీనికోసం భూమి నుంచి 1.5 మిలియన్ కిలీమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిలో ఉండే ప్రత్యేకత ఏమంటే నిరంతరాయంగా ఇది సూర్యుని చుట్టూ నిరంతరం తిరుగుతుంది. సూర్యగ్రహణాలలో కూడా... దీంతో అంతరిక్షం, అక్కడి వాతావరణం, గాలి, సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు వంటివి పరిశోధిస్తారు.
చంద్రయాన్-3 100% విజయవంతమైందని, చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టే హక్కు దేశానికి ఉందన్నారు. చంద్రయాన్-2 కుప్పకూలిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. రెండూ భారతీయ శబ్దాల పేర్లు. చంద్రయాన్ 3, ల్యాండర్, రోవర్ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయని, మొత్తం ఐదు పరికరాలు స్విచ్ ఆన్ అయ్యాయన్నారు. ఇవి డేటాను పంపుతున్నాయని మరో 9 రోజులు మిగిలి ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశం తీయలేని చంద్రుడి ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, ఆ ఫొటోలు కంప్యూటర్ కేంద్రానికి వెళ్తున్నాయని వాటిని శాస్త్రవేత్తలు ప్రాసెస్ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామని సోమనాథ్ ప్రటించారు.
చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23ను అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు. దీని లైవ్ ను ఇస్రో అధికారిక యూ ట్యూబ్ ఛానెల్ లైవ్ ఇవ్వగా ప్రపపంచంలోనే అత్యధికమంది లైవ్ వీడియోగా రికార్డు స్థాపించింది. దీనిని 80 లక్షల మంది వీక్షించారు.