Mon Dec 23 2024 15:14:11 GMT+0000 (Coordinated Universal Time)
అత్యంత అందమైన మహిళలు భారతీయులే.. పురుషుల అందంలో ఆ దేశం టాప్
వివిధ దేశాల మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని `అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్ సమ్, ప్రిట్టీ..
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు మహిళలకు అందం పోటీలు నిర్వహిస్తే ఎవరో ఒకరు విశ్వ సుందరిగా, ప్రపంచ సుందరిగా నిలుస్తుంటారు. కానీ ఓ సంస్థ ఒక అధ్యయనం నిర్వహించి.. ప్రపంచంలోకెల్లా అందమైన మహిళలు, అందమైన పురుషులు ఏయే దేశాల్లో ఉన్నారో పేర్కొంటూ ఒక్కో దేశానికి ఒక్కో ర్యాంక్ కేటాయించింది. అందమైన మహిళలున్న దేశాల లిస్ట్ లో భారత్ టాప్ ప్లేస్ లో ఉండగా.. అందమైన పురుషుల లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచింది. యూకేకు చెందిన మల్టీనేషనల్ వస్త్రాల కంపెనీ "పోర్ మోయి" ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా.. ప్రముఖ సోషల్ మీడియా యాప్ రెడ్డిట్ లో గతేడాది అప్ లోడ్ చేసిన ఫొటోలను పరిగణలోకి తీసుకుని ఓ అధ్యయనం చేసింది.
వివిధ దేశాల మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని `అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్ సమ్, ప్రిట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్..` వంటి కామెంట్లను.. ఆ పోస్టులకు, చిత్రాలకు వచ్చిన అప్ ఓట్లను పరిగణలోకి తీసుకుని పోర్ మోయి ఓ నివేదికను రూపొందించింది. పోర్ మోయి నిర్వహించిన స్టడీలో అత్యంత అందమైన మహిళలుగా భారతీయులే నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, స్వీడన్ లు ఉండగా.. వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్ఏ కు చెందిన మహిళలు ఉన్నారు.
ఇక పురుషుల విషయానికొస్తే.. అత్యంత అందమైన పురుషులు బ్రిటన్ లో ఉన్నట్లు పోర్ మోయి నివేదిక తెలిపింది. రెండో స్థానంలో భారత్, ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్ లు నిలిచాయి.
Next Story