Mon Dec 23 2024 10:09:25 GMT+0000 (Coordinated Universal Time)
కష్టకాలంలోనూ కనికరించని పాక్.. భారత్ పై తుర్కియే ప్రశంసలు
భారత్ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది టర్కీ ప్రభుత్వం. పక్కదారి పట్టవలసి వచ్చింది. భారతదేశంలోని టర్కీ రాయబారి
టర్కీలో భూకంప బాధితులకు సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత NDRF విమానానికి పాకిస్థాన్ తమ గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించింది. దాంతో ఆ విమానం మరో దారిలో టర్కీకి వెళ్లింది. భూకంపం సమాచారం అందగానే భారత్ తుర్కియేకు వైద్య సిబ్బంది, సహాయ సామగ్రిని తరలించింది. భారత్ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది టర్కీ ప్రభుత్వం. భారతదేశంలోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ తన దేశానికి నిధులు, సహాయ సామాగ్రిని అందించడంలో భారత ప్రభుత్వం యొక్క ఔదార్యానికి భారతదేశాన్ని తమ "దోస్త్" అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం, ఫిరత్ సునెల్ టర్కీకి సహాయం పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. టర్కీకి సహాయం చేసినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలుపుతూ.. టర్కీ రాయబారి సోషల్ మీడియా లో ఇలా పోస్ట్ చేశారు. "దోస్త్ అనేది టర్కిష్, హిందీలో ఒక సాధారణ పదం... మనకు ఒక టర్కిష్ లో ఒక సామెత ఉంది. "దోస్త్ కారా గుండే బెల్లి ఒలూర్" (అవసరంలో ఉన్న స్నేహితుడు నిజంగా స్నేహితుడు). మాకు అండగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు" అని ఫిరత్ సునేల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
టర్కీలో 24 గంటల వ్యవధిలో మూడు విధ్వంసకర భూకంపాలు సంభవించడంతో అపార నష్టం వాటిల్లింది. సోమవారం, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి (MoS) వి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున టర్కీకి సానుభూతిని, మద్దతును కూడా తెలియజేశారు.
Next Story