Wed Dec 25 2024 14:02:37 GMT+0000 (Coordinated Universal Time)
సూడాన్ లో ఘర్షణలకు భారతీయుడు మృతి
ఈ ఘర్షణల నేపథ్యంలో ఎవరూ బయటకు రావొద్దని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. తాజాగా జరిగిన ఘర్షణల్లో..
నార్త్ ఆఫ్రికాలోని సుడాన్ లో సైన్యం, పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో ఎవరూ బయటకు రావొద్దని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. తాజాగా జరిగిన ఘర్షణల్లో ఓ భారతీయుడు ప్రమాద వశాత్తు మరణించాడు. మృతుడిని ఆల్బర్ట్ అగస్టీన్ గా గుర్తించారు. ఈ విషయాన్ని సుడాన్లోని ఇండియన్ ఎంబసీ సోషల్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేసింది. సుడాన్లోని దాల్ గ్రూప్ కంపెనీలో ఆల్బర్ట్ పనిచేసేవాడు.
సైన్యంలో పాలామిలిటరీ దళాల విలీనంపై రెండు దళాల మధ్యా కొంత కాలంగా నెలకొన్న బేధాభిప్రాయాలు చివరకు ఘర్షణలకు దారి తీశాయి. సుడాన్ రాజధాని ఖార్తూమ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు దళాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో సుడాన్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటీవలే ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఓ భారతీయుడు సైనిక దళాల ఘర్షణకు బలవడం బాధాకరం.
Next Story