Mon Dec 23 2024 08:27:03 GMT+0000 (Coordinated Universal Time)
సింగపూర్ లో తోటి ఉద్యోగి వేలు కొరికిన ఇండియన్.. 10 ఏళ్లు జైలు
డార్మిటరీలో ఇతర వ్యక్తులతో కలిసి నీచమైన పనులు చేస్తున్నావంటూ దూషించాడు. ఇద్దరు కలిసి లారీ ఎక్కిన సమయంలో ఒకరినొకరు..
సింగపూర్ లో తోటి ఉద్యోగి వేలు కొరికిన భారతీయుడికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. లోగన్ గోవిందరాజ్ అనే వ్యక్తి 42 ఏళ్ల ముత్తు సెల్వం ఎడమ చేతి చిటికిన వేలిని కొరికేశాడు. వైద్యులు అతడి చేతి వేలిని తిరిగి అతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో.. లబోదిబోమంటున్నాడు బాధితుడు. 2020, డిసెంబర్ 6న సాయంత్రం 4.30 నిమిషాలకు గోవిందరాజ్, సెల్వంతో పాటు మరో వ్యక్తి మ్యూజిక్ వింటూ ఆల్కహాల్ సేవించారు. మద్యం మత్తులో గోవిందరాజ్ సెల్వం ను తిట్టాడు.
Also Read : భీమ్లా నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్.. వసూళ్ల సునామీ
డార్మిటరీలో ఇతర వ్యక్తులతో కలిసి నీచమైన పనులు చేస్తున్నావంటూ దూషించాడు. ఇద్దరు కలిసి లారీ ఎక్కిన సమయంలో ఒకరినొకరు తోపులాటతో కూడిన దూషణలు చేసుకున్నారు. సెల్వం అతణ్ని తోసేసి ఎడమ చేతిని ఛాతీపై నొక్కి పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. 'గోవిందరాజ్ ను చెంపదెబ్బ కొట్టి, చొక్కా పట్టుకులాగి పడేయడంతో సెల్వంను గాయపరిచాడని' డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెలిస్సా లీ కోర్టులో వెల్లడించారు. అయితే గొడవ జరిగినపుడు వేలు తెగిన విషయాన్ని వారిద్దరూ గమనించలేదని, తర్వాత సెల్వం క్లీన్ చేస్తూ.. తన చేతి వేలును పోగొట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే తన వేలిముక్కను తీసుకుని కూ టెక్ పాట్ హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సెల్వం వేలిని పోగొట్టుకోడానికి కారణమైన గోవిందరాజ్ పై కేసు నమోదుకాగా కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించి, జరిమానా కట్టాలని ఆదేశించింది.
Next Story