Tue Dec 24 2024 03:38:17 GMT+0000 (Coordinated Universal Time)
సముద్రపు దొంగలను వెంటాడి.. వేటాడి.. 19 మందిని రక్షించి
సముద్రపు దొంగల బారిన పడిన పంధొమ్మిది మందిని భారత నౌకాదళ రక్షించింది.
సముద్రపు దొంగల బారిన పడిన పంధొమ్మిది మందిని భారత నౌకాదళ రక్షించింది. సముద్రంలో వెళుతున్న వారిని అడ్డగించి తమ అధీనంలోకి తీసుకుంటున్న దొంగలు ఇటీవల కాలంలో ఎక్కువగా వింటూనే ఉన్నారు. తాజాగా సోమాలియా సముద్రపు దొంగల నుంచి భారత నౌకాదళం 19 మందిని రక్షించింది. వీరిలో పదకొండు మంది ఇరాన్, ఎనిమిది మంది పాక్కు చెందిన నావికులున్నట్లు భారత నౌకాదళం తెలిపింది. ఇరాన్ జెండాతో వెళుతున్న ఎఫ్వి ఓమరిల్ చేపల పడవను ఏడుగురు సోమాలియా సముద్రపు దొంగలు చుట్టుముట్టారు.
భారత నౌకాదళం..
అయితే సమాచారం తెలుసుకున్న భారత్ నౌకాదళం ఐఎన్ఎస్ శారదను రంగంలోకి దింపింది. వారు సముద్రపు దొంగలను వెంబడించి సముద్రపు దొంగల నుంచి పంధొమ్మిది మంది నావికులను కాపాడినట్లు భారత నౌకాదళ అధికార ప్రతినిధి వవివేక్ మధ్వాల్ ట్విట్టర్ లో తెలిపారు. భారత నేవీ కమెండోల సాహసానికి ఇది మరొక నిదర్శనమని అన్నారు. సముద్రంలో ప్రయాణించే భద్రతే లక్ష్యంగా తాము ఆపరేషన్ ను నిర్వహించామని ఆయన తెలిపారు. దీంతో భారత నౌకాదళంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Next Story