Sat Nov 23 2024 10:46:50 GMT+0000 (Coordinated Universal Time)
48 మంది పేషెంట్లపై అత్యాచారం చేసిన వైద్యుడు !
2018లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కృష్ణా సింగ్ (72) అనే వ్యక్తిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ శాఖ డిటెక్టివ్స్ కేసును
వైద్యో నారాయణో హరి అంటారు. మానవుడికి అనారోగ్యం వస్తే.. సాక్షాత్తు ఆ దేవుడే వైద్యుడి రూపంలో వచ్చి కాపాడుతాడని నమ్ముతారంతా. కానీ.. ఆ వైద్యుడే పేషెంట్ల పాలిట శాపమైతే ? అదే జరిగింది స్కాట్లాండ్ లో. కామావతారం ఎత్తి నయవంచకుడిగా మారాడు. 1983 నుంచి 2018 దాకా 48 మందిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చాలామందితో అసభ్యకరంగా కూడా ప్రవర్తించాడు. ఇదంతా చేసిన భారత సంతతికి చెందిన వైద్యుడు కావడం సిగ్గుచేటు.
2018లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కృష్ణా సింగ్ (72) అనే వ్యక్తిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ శాఖ డిటెక్టివ్స్ కేసును దర్యాప్తు చేసి, గ్లాస్గో హైకోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. కానీ.. ఆ కీచక వైద్యుడు మాత్రం తాను చేసిన తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నెపాన్ని భారత విద్యావ్యవస్థ మీదకు నెట్టే ప్రయత్నం చేశాడు. ''మహిళలు ఆరోపిస్తున్నదంతా అబద్ధం. కొన్ని పరీక్షలు మాకు భారత వైద్య శిక్షణలో భాగం. అదే మేం చదువుకున్నప్పుడు చెప్పారు'' అని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు.
కృష్ణా సింగ్ కు స్కాట్లాండ్ సొసైటీలో మంచి గౌరవం ఉంది. ఆయన వైద్య సేవలకుగానూ రాయల్ మెంబర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (ఎంబీఈ) పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. అంత మంచి పేరున్న వైద్యుడికి ఇదేం పోయేకాలం అని తిడుతున్నారు ఈ విషయం తెలిసినవారంతా. ఇప్పుడు మొత్తంగా 54 కేసుల్లో అతడిని కోర్టు దోషిగా ప్రకటించింది. వచ్చే నెలలో శిక్ష విధిస్తామని, అప్పటిదాకా బెయిల్ పై కృష్ణా సింగ్ ను విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు.
Next Story