Mon Dec 23 2024 11:47:58 GMT+0000 (Coordinated Universal Time)
మత్తులో ఉన్న మహిళపై అత్యాచారం.. ఏడాది తర్వాత వెలుగులోకి?
జూన్ నెలలో అతను నైట్ క్లబ్ కు వెళ్లాడు. అదే సమయంలో బాధిత మహిళ కూడా తన స్నేహితులతో కలసి ఆ క్లబ్ కు వెళ్లింది.
మద్యంమత్తులో ఉన్న ఓ మహిళపై భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంగ్లాండ్ లో జరిగిన ఈ ఘటన ఏడాది తర్వాత వెలుగుచూడటం గమనార్హం. నిందితుడికి స్థానిక న్యాయస్థానం ఏడేళ్లు జైలుశిక్ష విధించినట్లు కార్డిఫ్ పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రీత్ వికల్ అనే 20 ఏళ్ల యువకుడు సౌత్ వేల్స్ లోని కార్డిఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. గతేడాది(2022) జూన్ నెలలో అతను నైట్ క్లబ్ కు వెళ్లాడు. అదే సమయంలో బాధిత మహిళ కూడా తన స్నేహితులతో కలసి ఆ క్లబ్ కు వెళ్లింది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. క్లబ్ లో మహిళ మద్యం ఎక్కువగా తాగడంతో.. వికల్, సదరు మహిళ తన స్నేహితులను వదిలేసి బయటకు వచ్చారు.
మద్యం మత్తులో ఉన్న మహిళను వికల్ తన రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళను వికల్ క్లబ్ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు క్లబ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైందయ్యాయని వెల్లడించారు. మత్తులో ఉన్న మహిళను తొలుత తన చేతులతో తీసుకెళ్లిన వికల్.. ఆ తర్వాత భుజాలపై ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. కార్డిఫ్ లో మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం చాలా అరుదని పోలీసులు పేర్కొన్నారు. ప్రీత్ వికల్ వంటి ప్రమాదకరమైన వ్యక్తుల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని, అతను పక్కా ప్లాన్ తోనే ఆ మహిళను తన స్నేహితుల నుంచి బయటకు తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడని వివరించారు. నిందితుడైన ప్రీత్ వికల్ కు కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.
Next Story