Mon Dec 23 2024 09:42:06 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్లోరిడా రోడ్ యాక్సిడెంట్ లో ఇండియా టెకీ దుర్మరణం
భారత్ కు చెందిన మరియప్పన్ సుబ్రమణియన్ ఫ్లోరిడాలోని హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నాడు.
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. మరియప్పన్ అనే టెకీ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలోని తాంపాలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం (మే15) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
భారత్ కు చెందిన మరియప్పన్ సుబ్రమణియన్ ఫ్లోరిడాలోని హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నాడు. జాక్సన్ విల్లే నుంచి ఇటీవలే తాంపాకు షిఫ్ట్ అయ్యాడు. అతడికి భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వారు భారత్ లోనే ఉంటున్నారు. సోమవారం రోడ్డు దాటుతోన్న మరియప్పన్ ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో అతను తీవ్రగాయాలపాలై.. ఘటనా ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరియప్పన్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు, ఆయన కుటుంబ సభ్యులకు సహాయం చేసేందుకు మరియప్పన్ స్నేహితులు ‘గో ఫండ్ మీ’ ద్వారా నిధులు సేకరణకు యత్నిస్తున్నారు.
Next Story