Mon Dec 23 2024 09:52:47 GMT+0000 (Coordinated Universal Time)
3 సంవత్సరాల తర్వాత FBI తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ
FBI తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. మూడేళ్ళ క్రితం న్యూజెర్సీ నుండి తప్పిపోయిన 28 ఏళ్ల భారతీయ మహిళను "తప్పిపోయిన వ్యక్తుల" జాబితాలో చేర్చింది. ఆమె ఆచూకీ గురించి తెలియజేయాలని ప్రజల నుండి సహాయం కోరుతోంది. మయూషి భగత్ చివరిసారిగా ఏప్రిల్ 29, 2019 సాయంత్రం న్యూజెర్సీలోని జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుండి బయలుదేరారు. ఆమె చివరిగా రంగురంగుల పైజామా ప్యాంటు, నల్లటి టీ-షర్ట్ ధరించి కనిపించింది. మే 1, 2019న భగత్ తప్పిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు నివేదించారు. ఆమె 5 అడుగుల 10 అంగుళాల పొడవు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఉంది. భగత్ 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఆమె న్యూ హాంప్‌షైర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NYIT)లోనూ అడ్మిషన్ తీసుకుంది.
FBI కు చెందిన నెవార్క్ డివిజన్ బుధవారం తన వెబ్‌పేజీలో "తప్పిపోయిన వ్యక్తుల" జాబితాలో భగత్‌ను చేర్చిందని FBI స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ జేమ్స్ డెన్నెహీ తెలిపారు. భగత్ ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ మాట్లాడతారు. ఆమెకు సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్, న్యూజెర్సీ ప్రాంతంలో స్నేహితులు ఉన్నారు. భగత్ గురించి సమాచారం ఉన్న ఎవరైనా స్థానిక FBI కార్యాలయం లేదా సమీపంలోని అమెరికన్ ఎంబసీ లేదా కాన్సులేట్‌ను సంప్రదించాలని FBI తెలిపింది. FBI తన వెబ్సైట్లో భగత్ 'తప్పిపోయిన వ్యక్తి' పోస్టర్‌ను "కిడ్నాప్‌లు/తప్పిపోయిన వ్యక్తుల మోస్ట్ వాంటెడ్" జాబితా క్రింద ఉంచింది.
Next Story