Mon Dec 23 2024 06:09:57 GMT+0000 (Coordinated Universal Time)
జాగ్రత్త..పెళ్లికి ముందు శృంగారం చేస్తే.. జైలు శిక్ష
ఇండోనేషియాలో త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఇండోనేషియా ప్రభుత్వం..
పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించేలా ఓ దేశంలో కొత్త చట్టం రానుంది. ఇండోనేషియాలో త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఇండోనేషియా ప్రభుత్వం ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. త్వరలో పార్లమెంట్ లో ఈ బిల్లను ప్రవేశపెట్టనున్నారు. గతంలోనే దీనిపై డ్రాఫ్ట్ బిల్లు తీసుకురాగా.. ఆ దేశ పౌరులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు చేశారు.
ఈ బిల్లుతో ప్రభుత్వం తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. తమ స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదంటున్నారు. కానీ.. తమ దేశ విలువలను కాపాడుకునేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ వెల్లడించారు.
Next Story