Fri Nov 22 2024 18:29:17 GMT+0000 (Coordinated Universal Time)
డ్యాన్స్ చేసిన జంటకు జైలు శిక్ష : దేశ బహిష్కరణ
ఈ నేపథ్యంలో నిరసనకారులకు మద్దతుగా అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే ఓ బ్లాగర్ జంట టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో..
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా నిలిచి డ్యాన్స్ చేసిన జంటకు జైలు శిక్ష విధించడంతో పాటు దేశం నుండి బహిష్కరించింది. ఇరాన్ లో కొద్దినెలలుగా హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసన కారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల పాటు జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే బ్లాగర్ జంట ఇరాన్ హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులకు మద్దతుగా అస్తియాజ్ హగిగి, అమీర్ మహ్మద్ అహ్మదీ అనే ఓ బ్లాగర్ జంట టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. ఆ జంటపై ఇరాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జంటను అరెస్ట్ చేసి రెవెల్యూషనరీ కోర్టు ఇరాన్ జాతీయ భద్రతకు హాని కలిగించారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. వారికి 10 సంవత్సరాల 6 నెలలపాటు జైలు శిక్ష విధించింది. సైబర్ స్పేస్ ను వినియోగించుకున్నందుకు వారిని రెండేళ్లపాటు ఇరాన్ నుండీ బహిష్కరిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది.
Next Story