Sat Nov 23 2024 03:50:44 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులకు విషప్రయోగంపై ఇరాన్ సీరియస్.. నిందితులకు మరణశిక్ష?
వాంతులతో ఆస్పత్రుల్లో చేరిన బాలికలను పరీక్షించగా విషప్రయోగం జరిగినట్లు తేలింది. మూడు నెలల్లో 1000 మందికి పైగా..
బాలికలను విద్యకు దూరం చేయాలన్న లక్ష్యంతో ఇరాన్ లో ఇటీవల వందలాది బాలికలపై మతఛాందసవాదులు విషప్రయోగం చేశారన్న విషయం తెలిసిందే. ఫలితంగా వారంతా ఆస్పత్రుల పాలయ్యారు. వాంతులతో ఆస్పత్రుల్లో చేరిన బాలికలను పరీక్షించగా విషప్రయోగం జరిగినట్లు తేలింది. మూడు నెలల్లో 1000 మందికి పైగా బాలికలపై విషప్రయోగం జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలపై తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు.
బాలికలపై జరిగిన ఇలాంటి నేరాలను ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదని, ఈ చర్యలకు పాల్పడిన వారికి మరణశిక్ష ఖాయమని హెచ్చరించారు. బాలికలపై విషప్రయోగ ఘటనలపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని తేలితే.. దోషులను క్షమించవద్దని, వారికి మరణదండన విధించాలని ఆదేశించారు. మూడు నెలల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
Next Story