Mon Dec 23 2024 02:28:25 GMT+0000 (Coordinated Universal Time)
Iran : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇరాన్- అజర్ బైజాన్ సరిహద్దుల్లో రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం అటవీ ప్రాంతంలో జరగడంతో శకలాలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. ప్రతి కూల వాతావరణంలో ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
హెలికాప్టర్ ప్రమాదంలో...
దట్టంగా మంచుకురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు కూడా ఆటంకంగా మారింది. అయితే ఎట్టకేలకు హెలికాప్టర్ శకలాలను సహాయక బృందాలు గుర్తించాయి. హెలికాప్టర్ లో ఇబ్రహీం రైసీతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశం లేదు. ఇంకా మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం, మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలు ఆటంకంగా మారాయి.
Next Story