Fri Nov 22 2024 10:48:04 GMT+0000 (Coordinated Universal Time)
Japan : చంద్రుడిపై స్పేస్ షిప్ ల్యాండ్ అయింది.. కానీ?
చంద్రుడిపై జపాన్ స్పేస్ షిప్ ల్యాండ్ అయింది. ఈ మేరకు జపాన్ అంతరిక్ష సంస్థ అధికారికంగా వెల్లడించింది
చంద్రుడిపై జపాన్ స్పేస్ షిప్ ల్యాండ్ అయింది. ఈ మేరకు జపాన్ అంతరిక్ష సంస్థ అధికారికంగా వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై ఉదయం 12.20 గంటలకు స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ దిగిందని ఆ సంస్థ పేర్కొంది. చంద్రుడిపై స్పేస్ షిప్ ను విజయవంతంగా పంపిన ఐదో దేశంగా జపాన్ కూడా అవతరించింది.
విద్యుత్తు ఉత్పత్తి...
అయితే సేఫ్ గా ల్యాండ్ అయినప్పటికీ స్పేస్ షిప్ లో ఉన్న సౌర ఫలకాలు పనిచేయడం లేదని తెలిపింది. వాటి నుంచి విద్యుత్తు ఉత్పత్తి జరగలేదని పేర్కొంది. ప్రస్తుతం జపాన్ పంపిన స్పేస్ షిప్ సొంత బ్యాటరీపైనే ఆధారపడి నడుస్తుందని పేర్కొంది. బ్యాటరీ అయిపోయేలోగా సౌర విద్యుత్తు అందుబాటులోకి రాకపోతే ల్యాండర్ పని అయిపోయినట్లేనని చెబుతున్నారు. మొత్తం మూన్ స్నెపర్ తాము నిర్దేశించిన చోటనే ల్యాండ్ అవ్వడం తమ సక్సెస్ గా వారు భావిస్తున్నారు.
Next Story