Tue Nov 05 2024 10:50:35 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో చైన్ స్నాచర్ల టార్గెట్ మన వాళ్లే
ఇళ్లలోకి ఎప్పుడు ప్రవేశించాలి, ఏమి తీసుకెళ్లాలి, ఎలా అదృశ్యం కావాలనే విషయాలను పక్కా ప్లాన్ ప్రకారం
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో భారతీయ, దక్షిణాసియా కుటుంబాలను చైన్ స్నాచర్లు టార్గెట్ చేస్తున్నారు. ఆడవాళ్లు ధరించే ఖరీదైన ఆభరణాలను దొంగలు టార్గెట్ చేస్తున్నారని మీడియా నివేదిక తెలిపింది.
CBS న్యూస్ ప్రకారం.. మసాచుసెట్స్‌లోని బిల్లెరికా, నాటిక్, వెస్టన్, వెల్లెస్లీ, ఈస్టన్, నార్త్ అటిల్బోరో పట్టణాలలో జరిగిన సంఘటనలను పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ దొంగలు ముఖ్యంగా భారతీయ మహిళలను టార్గెట్ చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. మిడిల్సెక్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ మరియన్ ర్యాన్ మాట్లాడుతూ, ఈ దొంగలు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. యజమానులు ఉన్నారా లేదా చూస్తున్నారని, ఎలాంటి ఆర్ట్‌వర్క్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకోవడం లేదని అన్నారు. కేవలం బంగారం, వాచ్ లు వంటి వస్తువులను దొంగిలిస్తున్నారని తెలిపారు. దోపిడీల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ దొంగలు లింకన్‌లోని భారతీయ-అమెరికన్ సమీర్ దేశాయ్ ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. జూలై ప్రారంభంలో ఈ కుటుంబం పది రోజుల పాటు ట్రావెలింగ్ లో ఉందని.. ఆ సమయంలో ఆ ఇంటి రెండవ అంతస్తు కిటికీ నుండి వారు ఇంట్లోకి ప్రవేశించారని నివేదిక తెలిపింది. ఇంట్లోని నగలు, అనేక పర్సులు, గడియారాలు, ఇతర వస్తువులను దొంగిలించారని దేశాయ్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు.
ఈ దోపిడీ ముఠా సభ్యులు ఇంటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు, వారి ఇళ్లలోకి ఎప్పుడు ప్రవేశించాలి, ఏమి తీసుకెళ్లాలి, ఎలా అదృశ్యం కావాలనే విషయాలను పక్కా ప్లాన్ ప్రకారం అమలు చేస్తూ ఉన్నారు. ఇక చైన్ స్నాచర్లు కూడా భారత మహిళలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. గత జూన్‌లో న్యూజెర్సీలోని ఆసియన్ అమెరికన్ కమ్యూనిటీ దొంగతనాలకి గురయ్యే ప్రమాదం ఉందని FBI హెచ్చరించింది. అక్టోబర్ 2022లో, న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలోని పోలీసులు, భారతీయ-అమెరికన్ల నగలను, విలువైన వస్తువులను టార్గెట్ చేసిన కొలంబియన్ దొంగల ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో భారతీయ-అమెరికన్ మహిళలను లక్ష్యంగా చేసుకుని, దాడి చేసి, దోచుకున్న వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. మే 2021లో న్యూజెర్సీలో కూడా దొంగల ముఠాలను అరెస్టు చేశారు.
Next Story