Mon Dec 23 2024 00:47:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ పాప్ సింగర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ స్వాధీనం
ఆమె హాజరు కావడం లేదని ఈవెంట్ ఆర్గనైజర్లు ముందుగా మీడియాకు తెలిపారు. కాసేపటికి ఆమె ..
ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హేసూ (29) సోమవారం (మే15) బలవన్మరణానికి పాల్పడింది. దక్షిణ కొరియాలోని జియోల్లబుక్ - డో ప్రావిన్స్ లోని ఓ హోటల్ గదిలో ఆమె విగత జీవిగా పడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. పోలీసులు ఆమె మృతదేహం వద్ద ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. దానిని బట్టి ఆమెది సూసైడ్ గా నిర్థారించారు.
వాంజుగన్ లో మే 20న గ్వాన్ జుమియోన్ పీపుల్స్ డే ఈవెంట్ కు హేసూ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె హాజరు కావడం లేదని ఈవెంట్ ఆర్గనైజర్లు ముందుగా మీడియాకు తెలిపారు. కాసేపటికి ఆమె బలవన్మరణం చెందినట్లు చెప్పడంతో.. హేసూ మరణవార్త వెలుగులోకొచ్చింది. ఆమె ఎందుకు ఇలా చేసిందనేందుకు గల కారణాలు తెలియరాలేదు. 1993లో పుట్టిన హేసూ.. ‘మై లైఫ్, ‘మీ’ అనే ఆల్బమ్‌తో 2019లో కే పాప్ సింగర్‌గా కెరియర్ ను ప్రారంభించింది. గాయో స్టేజ్, హ్యంగౌట్ విత్ యూ, ది ట్రోట్ షో వంటి కార్యక్రమాల్లోనూ పాడి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. హేసూ మరణం ఆమె అభిమానులను విషాదంలోకి నెట్టేసింది.
Next Story