Thu Nov 07 2024 07:41:20 GMT+0000 (Coordinated Universal Time)
భారత హైకమిషన్‌పై దాడి
ఖలిస్థానీ వేర్పాటు వాదులు ప్రత్యేక దేశం కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. రాయబార కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు.
ఖలిస్థానీ వేర్పాటు వాదులు తమకు ప్రత్యేక దేశం కావాలంటూ వివిధ దేశాల్లో ఆందోళన చేస్తున్నారు. రాయబార కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. అంతటితో ఆగకుండా ఆదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో ఎగురుతున్న భారత జెండాను తొలిగించి ఖలీస్తానీ జెండాను ఎగురేస్తున్నారు. లండన్ హైకమిషన్ కార్యాలయంపై కూడా ఖలీస్థానీ ఏర్పాటువాదులు అటాక్ చేసి భారత జెండాను తొలగించి వారి జెండాను ఎగురువేసే ప్రయత్నం చేశారు.
ఎన్ఐఏకు అప్పగింత...
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఆ ఘటనను బ్రిటన్ పోలీసులు చూస్తూ ఊరుకోవడం పట్ల కూడా భారత ప్రభుత్వం కొంత అసహనం వ్యక్తం చేసింది. గతంలో ఖలీస్థానీ వేర్పాటు వాదులు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోనూ రాయబార కార్యాలయాలపై దాడులకు దిగారు. ఆ యా దేశాల ప్రభుత్వాలు వీటిని అడ్డుకోవాలని భారత ప్రభుత్వం కోరుతుంది.
Next Story