Mon Dec 23 2024 17:35:12 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో తెలుగు ప్రొడ్యూసర్ కు 27 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలో తెలుగు వ్యక్తి కిషన్ మోదుగుపూడికి అక్కడ 27 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది.
అమెరికాలో తెలుగు వ్యక్తి కిషన్ మోదుగుపూడికి అక్కడ 27 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది. ఫెడరల్ పోలీసులు కేసును ఇన్విస్టిగేషన్ చేసి ఛార్జిషీట్ చేశారు. ఈ మేరకు కేసు బలంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు. కిషన్ మోదుగుపూడి, చంద్రకళ ఇద్దరు భార్యభర్తలు. అమెరికాకు వెళ్లి అక్కడ అక్రమంగా నివసిస్తున్నారని పోలీసుల ఇన్విస్టిగేషన్ లోనూ తేలింది.
ఈవెంట్ల పేరుతో.....
కిషన్ మోదుగుపూడి, చంద్రకళను 2018లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి హీరోయిన్లను, యాంకర్లను ఈవెంట్ పేరిట అమెరికాకు తీసుకెళ్లి వ్యభిచార నిర్వహిస్తున్నారన్న విషయం అప్పట్లో సంచలనం కల్గించింది. బీ1, బీ2 వీసాల పేరిట వీరిని అమెరికాకు తీసుకెళ్లి వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఫెడరల్ పోలీసులు ఛార్జిషీటులో పేర్కొన్నారు. అమెరికాలో ఈ దంపతులిద్దరూ కొన్నేళ్లుగా చట్ట విరుద్దంగా నివసిస్తున్నారని కూడా విచారణలో తేలింది. దీంతో కిషన్ మోదుగుపూడికి 27 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని అక్కడి న్యాయవాదులు చెబుతున్నారు. అనేక తెలుగు సినిమాలకు కిషన్ కో - ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
Next Story