Mon Dec 23 2024 13:21:23 GMT+0000 (Coordinated Universal Time)
మూడో మహిళ ప్రధానిగా లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ విజయం సాధించారు. రిషి సునాక్ పై ఆమె సునాయాసంగా విజయం సాధించారు
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ విజయం సాధించారు. రిషి సునాక్ పై ఆమె సునాయాసంగా విజయం సాధించారు. 47 ఏళ్ల లిజ్ ట్రస్ బ్రిటన్ కు మూడో మహిళ ప్రధానిగా బాధ్యతలను చేపట్టనున్నారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. గత కొన్ని రోజుల నుంచి రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అయితే అన్ని సర్వేల్లో లిజ్ ట్రస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఆరువారాల నుంచి సాగిన ప్రచారంలో లిజ్ ట్రస్ దే పై చేయి అయింది.
హోరాహోరీ పోరు...
బోరిస్ జాన్సన్ వారసురాలిగా ఆమె ప్రధాని బాధ్యతలను చేపట్టబోతున్నారు. కన్సర్వేటివ్ పార్టీలో అధికశాతం మంది లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాకు 60,399 ఓట్లు వచ్చాయి ఇరవై ఒక్క వేల ఓట్ల తేడాతో ఆమె సునాయాసంగా విజయం సాధించారు. దాదాపు 1.60 లక్షల మంది కన్సర్వేటివ్ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రిగా పనిచేసిన లిజ్ ట్రస్ నేడు బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు.
Next Story