Tue Nov 05 2024 09:20:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ని మాటలు చెప్పిందో.. చివరికి పెళ్లి చేసేసుకుంది
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజు
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ మహిళ అంజు (34) ఇస్లాంను స్వీకరించి ఆమె ప్రియుడు నస్రుల్లా (29)ని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారితెలిపారు. ఖైబర్‌ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని స్థానిక కోర్టులో వీరి వివాహం జరిగిందని, నిఖాకు ముందు ఆమె ఇస్లాంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకుందని పాక్ మీడియా నివేదించింది. తమ వివాహంలో ఎవరి బలవంతమూ లేదని వధూవరులు అంగీకరించారని, బంధువులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పోలీసుల సమక్షంలో వారి వివాహం జరిగిందని తెలిపారు.
రాజస్థాన్‌లోని భివండీకి చెందిన అంజూ స్థానికంగా బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త అరవింద్ కూడా ప్రైవేటు ఉద్యోగి. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంజూకు కొంత కాలం క్రితం ఫేస్బుక్లో పాక్‌లోని ఖైబర్ పాఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లాతో పరిచయం ఏర్పడింది. అతడి కోసమే ఆమె పాక్ కు వెళ్ళింది. మొదట తాను పెళ్లి చేసుకోడానికి వెళ్లలేదని అంజూ చెప్పింది. ఓ మీడియా సంస్థతో అంజూ మాట్లాడుతూ.. నేను పాకిస్థాన్‌లో ఉన్నాను.. ప్రస్తుతం మనాలి లాంటి పర్వత ప్రాంతంలో నేను సురక్షితంగా ఉన్నానని చెప్పింది. పాకిస్థాన్ వెళ్లే విషయం ఎవరికీ ఏమీ చెప్పలేదని.. తాను కేవలం జైపూర్ మాత్రమే వెళుతున్నానని చెప్పానని అంజూ తెలిపింది. అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించిన తర్వాతనే పాకిస్థాన్ కు వెళ్లాలని.. ఇక్కడ ఒక పెళ్లి కోసం వచ్చానని చెప్పింది. నన్ను సీమ హైదర్‌తో పోల్చడం తప్పు. నేను తిరిగి వస్తానని అంది.
కానీ ఆమె అబద్ధాలు చెప్పిందని పాక్ మీడియా కథనాల ద్వారా స్పష్టమైంది. అంజు, నస్రుల్లా ఇద్దరూ భారీ భద్రత మధ్య పర్యాటక ప్రాంతాల్లో తిరిగారు. వారి ఫొటోలు వైరల్ అయ్యాయి. తన ప్రేమను వెతుక్కుంటూ తాను ఇక్కడికి వచ్చానని, ఇక్కడే ఉండిపోతానని అంజు చెప్పింది. ఆగస్టు 20తో ఆమె వీసా గడువు ముగియనుంది. పిల్లల కోసం అయినా అంజూ భారత్ కు వస్తుందో లేదో చూడాలి.
Next Story