Mon Dec 23 2024 01:52:41 GMT+0000 (Coordinated Universal Time)
ఇండోనేషియాను కుదిపేసిన వరుస భూకంపాలు
తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండవది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపాల కారణంగా..
ఇండోనేషియాను మళ్లీ వరుస భూకంపాలు బెంబేలెత్తించాయి. ఆదివారం తెల్లవారుజామున తొలి భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే మరో భూకంపం సంభవించడంతో.. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు. తొలి భూకంపం కేపులాన్ బటులో 6.1 తీవ్రతతో సంభవించగా, 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) తెలిపింది.
తొలి భూకంపం భూమికి 43 కిలోమీటర్ల లోతున, రెండవది 40 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపాల కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. గత బుధవారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సబాంగ్కు నైరుతి దిశగా 16 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప సమయంలో ఇళ్లలోని వస్తువులు, ఫ్యాన్లు ఊగుతున్న వీడియోలు పలువురు నెట్టింట్లో పోస్ట్ చేశారు.
Next Story