Mon Dec 23 2024 10:21:34 GMT+0000 (Coordinated Universal Time)
విడాకులు వచ్చాయన్న ఆనందంలో బంగీజంప్.. మెడ, వెన్ను విరిగి
ఫిబ్రవరి 11న కాంపో మాగ్రో ప్రాంతంలోని ఓ సరస్సుకు వెళ్లిన అతను.. అక్కడున్న వంతెన పై నుంచి బంగీజంప్..
విడాకులు వచ్చాయన్న ఆనందంలో ఓ యువకుడు భంగీ జంప్ అనే సాహసక్రీడలో పాల్గొన్నాడు. అయితే అది అతనికి ఊహించని ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. బంగీ జంప్ చేసేవాళ్లను చూడటానికి బాగానే ఉన్నా.. నిజంగా ఆ క్రీడలో పాల్గొనాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఓ యువకుడు తన విడాకుల విషయాన్ని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో బంగీజంప్ లో పాల్గొన్నాడు. అయితే అనూహ్యంగా అతను 70 అడుగుల ఎత్తు నుండి పడిపోవడంతో అతని మెడ, వెన్నెముక విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన బ్రెజిల్ లో వెలుగుచూసింది.
రాఫేల్ డాస్ సొంటోస్ అనే 22 ఏళ్ల యువకుడికి ఈ ఏడాది జనవరిలో విడాకులు వచ్చాయి. తన భార్య నుండి విముక్తి వచ్చిందని సంబరపడిపోయిన అతను.. తన జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించాలనుకున్నాడు. ఫిబ్రవరి 11న కాంపో మాగ్రో ప్రాంతంలోని ఓ సరస్సుకు వెళ్లిన అతను.. అక్కడున్న వంతెన పై నుంచి బంగీజంప్ చేయాలనుకున్నాడు. తన కాళ్లకు తాడు కట్టుకుని బ్రిడ్జిపై నుండి దూకాడు. దురదృష్టవశాత్తు కాళ్లకు కట్టుకున్న తాడు తెగిపోవడంతో అతను 70 అడుగుల ఎత్తు నుండి తలకిందులుగా పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, వెన్నెముక విరిగిపోగా.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే గాయాల నుండి కోలుకుంటున్న రాఫేల్.. తన జీవితం పూర్తిగా మారిపోయిందని తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. తన జీవితం ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Next Story