Mon Dec 23 2024 19:54:31 GMT+0000 (Coordinated Universal Time)
భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. ఎప్పుడంటే..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారం ఇచ్చింది. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని పేర్కొంది..
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారం ఇచ్చింది. మరో 159 ఏళ్లలో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభావం 22 అణు బాంబులంతటి శక్తివంతమైందని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తల అంచనాను బట్టి 2182 నాటికి బెన్నూ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం స్వల్పంగా ఉంది. ఒకవేళ బెన్నూ ఆస్టరాయిడ్ ఢీకొంటే.. 22 అణు బాంబుల శక్తితో భూమిపై ప్రభావం చూపుతుందని పలు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే రానున్న కాలంలో అంతరిక్షం నుంచి భూమికి పెను సంక్షోభం రాబోతోంది. దీనిపై నాసా కన్ను వేసింది. దీనిపే ఆస్టరాయిడ్ బెన్నూ. దీని కారణంగా భవిష్యత్తులో ఈ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. బెన్నూ గ్రహశకలాన్ని 1999లో మొదటిసారిగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
నివేదిక ప్రకారం.. భూమి వైపు కదులుతున్న ఈ పెద్ద ముప్పు 40 మిలియన్ సంవత్సరాలకు పైగా ఉంది. NASA ప్రకారం.. 1999 లో గుర్తించిన ఈ బెన్నూ అనే గ్రహశకలం 159 సంవత్సరాలలో భూమిని ఢీకొట్టవచ్చు చెబుతున్నారు. బెన్నూ అనే గ్రహశకలం 2182లో భూమిని ఢీకొట్టవచ్చు. అయితే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి బెన్నూ భూమికి సమీపంలో వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది 1999, 2005, 2011 సంవత్సరాలలో భూమికి అతి సమీపంలోకి వచ్చినట్లు చెబుతున్నారు.
బెన్నూ భూమిని ఢీకొనే సంభావ్యత 0.037 శాతం మాత్రమేనని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. బెన్నూ భూమిని ఢీకొంటే దాని నుంచి 1200 మెగాటన్నుల శక్తిని విడుదల చేయవచ్చు. ఈ శక్తి ఇప్పటి వరకు అణ్వాయుధం కంటే 24 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం అవుతుంది. దీనితో పాటు భూమిపై జీవాన్ని అందించే బెన్నూలో అలాంటి కొన్ని ఆర్గోనిక్ అణువులు ఉండే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
Next Story