Sun Dec 14 2025 06:12:46 GMT+0000 (Coordinated Universal Time)
Big Breaking : బ్యాంకాంగ్, మయన్మార్ లో భారీ భూకంపం
బ్యాంకాంగ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా నమోదయింది. మయన్మార్ లోనూ భూకంపం సంభవించింది.

బ్యాంకాంగ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రతగా నమోదయింది. మయన్మార్ లోనూ భూకంపం సంభవించింది. ఇక్కడ 7.7 తీవ్రతగా రిక్టర్ స్కేల్ పై నమోదయింది. దీంతో అనేక భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిసింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశముందంటున్నారు. బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో పెద్దయెత్తున ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు.
పెద్ద యెత్తున ఆస్తి నష్టం...
బ్యాంకాంక్, మయన్మార్ లో జరిగిన భూకంప తీవ్రత కారణంగా ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకునిపిల్లలను చేతుల్లోకి తీసుకుని బయటకు పరుగులు పెట్టిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ భూకంప నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు బయటకు వచ్చి తమ వారి కోసం అరుపులు కేకలు పెడుతున్నారు. ఆర్తనాదాలతో వీధులన్నీ దద్దరిల్లిపోతున్నాయి.
Next Story

