Mon Dec 23 2024 08:22:37 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఉద్యోగులకు మెటా ఉద్వాసన
మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్ మెంట్ ఇలా చాలా విభాగాల్లో ప్రపంచంలోని..
ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా సంస్థలో ఉద్యోగుల లే ఆఫ్ లు కొనసాగుతున్నాయి. 10 వేల మంది ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తామని మెటా మార్చిలోనే ప్రకటించింది. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 4 వేల మందికి ఉద్వాసన పలికింది. తాజాగా మరో 6 వేల మంది ఉద్యోగులకు మెటా వీడ్కోలు పలికింది.
మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్ మెంట్ ఇలా చాలా విభాగాల్లో ప్రపంచంలోని ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపుల్లో అత్యధికంగా ఇంజినీరింగ్ యేతర విభాగాల్లో ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం. లే ఆఫ్ లకు గురైన ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన తెలియజేస్తున్నారు. మెటా లే ఆఫ్ ల ప్రభావం భారత్ లో ఉద్యోగులపై కూడా పడింది. పింక్ స్లిప్స్ అందుకున్న వారిలో భారత్ లో అత్యధిక జీతం పొందుతున్నవారు ఉన్నారు. మార్కెటింగ్ డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్ నర్ షిప్ డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలిసింది.
Next Story