Mon Dec 23 2024 07:54:44 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్ స్టా, ఫేస్ బుక్ యూజర్లకు షాకిచ్చిన జుకర్ బర్గ్
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్ల అకౌంట్ల ధ్రువీకరణ కోసం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు..
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని వారు లేరు. అరచేతిలో ఆరంగుళాల స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాటిలో వచ్చే రీల్స్ చూస్తూ.. రోజంతా మరో పని లేకుండా కాలక్షేపానికి అలవాటుపడిపోయిన సోమరులెందరో ఉన్నారు. అలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్లకు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ దిమ్మతిరిగే షాకిచ్చారు. ఇప్పటికే ట్విట్టర్లో బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ పేరిట.. మస్క్ యూజర్ల ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అదే బాటలో మెటా కూడా ప్రయాణించనుంది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూజర్ల అకౌంట్ల ధ్రువీకరణ కోసం సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఆదివారం ప్రకటించారు. త్వరలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో సర్వీసును ప్రవేశపెడతామన్నారు. ధృవీకరణ సర్వీసకోసం ప్రతినెలా 11.99 డాలర్లు (రూ.999.76), ఐఓఎస్ యూజర్లైతే 14.99 డాలర్లు (రూ.1239.67) చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన వ్యక్తిగత గుర్తింపు కార్డులతో పెయిడ్ వెరిఫికేషన్ ను పొందవచ్చు. వెరిఫికేషన్ పూర్తయ్యాక అకౌంట్లకు బ్లూ బ్యాడ్జిని కేటాయిస్తారు. సబ్స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లకు నకిలీల బెడద లేకుండా ఫేస్బుక్ అదనపు భద్రత కూడా కల్పిస్తుంది. విడతవారీగా ఈ సర్వీసును అన్నిదేశాలకు విస్తరింపజేయనున్నట్లు జుకర్ తెలిపారు.
Next Story