Fri Nov 22 2024 13:09:34 GMT+0000 (Coordinated Universal Time)
రష్యాలో ఇన్ స్టా గ్రామ్ సేవలు బంద్
తాజాగా ఇన్ స్టా గ్రామ్ కూడా సంచలన ప్రకటన చేసింది. రష్యాలో తన సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
రష్యా : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో కాల్పులు విరమించినా.. తర్వాత బాంబుల దాడితో ఉక్రెయిన్ ను వణికిస్తోంది. రష్యా పద్ధతి మార్చుకోవాలని అమెరికా, భారత్ సహా పలు దేశాలు సూచించినా వినిపించుకోలేదు. దాంతో నాటో, ఈయూ దేశాలతో పాటు అమెరికా కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. ఇటీవలే గూగుల్ ప్లే, యూట్యూబ్ సంస్థలు కూడా అక్కడ చెల్లింపులతో కూడిన సేవలను నిలిపివేశాయి. కొన్ని టెక్ సంస్థలు సైతం రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ కూడా సంచలన ప్రకటన చేసింది. రష్యాలో తన సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి స్వయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో రష్యాలో పాప్యులర్ అయిన ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన సుమారు 80 మిలియన్ల మంది యూజర్లు తగ్గుతారని ఆయన అంచనా వేశారు. ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్, మానిటైజేషన్‌ను గతంలోనే నిలిపివేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుని, అందరికీ షాకిచ్చింది.
Next Story