Mon Dec 23 2024 10:55:17 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు
జాలిస్కో ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల మానవ శరీరాలు బయటపడ్డాయి. ఆ శరీర..
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దారుణ హత్యోదంతాలు వెలుగు చూశాయి. శ్రద్ధావాకర్ హత్యతో మొదలు అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హైదరాబాద్ లోనూ ఓ మహిళ అలాంటి హత్యకే గురైంది. తాజాగా 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు కనిపించడం ఒళ్లు గగుర్పాటయ్యేలా చేసింది. ఈ ఘటన ఉత్తర అమెరికా దేశమైన మెక్సికోలో బయటికొచ్చింది. దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతి, యువకుల కోసం గాలిస్తున్న క్రమంలో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
జాలిస్కో ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల మానవ శరీరాలు బయటపడ్డాయి. ఆ శరీర భాగాలు స్త్రీ, పురుషుడికి సంబంధించినవని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 20వ తేదీన సుమారు 30 ఏళ్ల వయసున్న ఏడుగురు యువతీ యువకులు కనిపించకుండా పోయారు. మిస్సైన వారంతా ఒకే కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారు. వారంతా మిస్సయ్యారని వేర్వేరు రోజుల్లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈ ఘటన వెలుగుచూసింది.
ఆ బ్యాగులు లభ్యమైన ప్రాంతం వారు పనిచేసే కాల్ సెంటర్ కు సమీపంలోనే ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ కాల్ సెంటర్లో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న నేపథ్యంలో పోలీసులు దానిపై దృష్టి పెట్టారు. అక్కడ మత్తు పదార్థాలు, రక్తపు మరకలతో ఉన్న వస్తువులతో పాటు కొన్ని డాక్యుమెంటర్లను గుర్తించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆ బ్యాగుల్లో లభ్యమైంది మిస్సైన ఏడుగురివేనా ? వారిని ఎవరు చంపారు ? కాల్ సెంటర్లో ఏం జరుగుతుంది ? అన్న విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Next Story