Wed Nov 06 2024 06:29:38 GMT+0000 (Coordinated Universal Time)
USA : ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా
అమెరికా అధ్యక్ష స్థానం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే డెమొక్రాట్లు, రిపబ్లికన్లు సన్నాహక ప్రక్రియను ప్రారంభించారు. అయితే తాజాగా తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. రిపబ్లికన్ నేతగా ఆయన బరిలోకి దిగినా మధ్యలోనే ఆయన అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అభ్యర్థుల విజయం కోసం...
అందరితో చర్చించిన తర్వాత తాను అధ్యక్ష స్థానం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మైక్ పెన్స్ ప్రకటించారు. లాస్ వేగాస్ లో జరిగిన రిపబ్లికన్ జెనిష్ కొయిలేషన్ వార్షిక సదస్సులో ఆయన స్వయంగా ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే తాను ప్రచార కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉంటానని, సంప్రదాయ విలువలకు కట్టుబడి రిపబ్లికన్ నేతలకు మద్దతుగా కొనసాగుతానని ఆయన తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరుపున డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి, ర్యాన్ బింక్లీ, టిమ్ స్కాట్ తదిరులు పోటీ పడుతున్నారు.
Next Story