Mon Dec 23 2024 01:03:19 GMT+0000 (Coordinated Universal Time)
జైలుపై దాడి ..600 మంది ఖైదీల పరారీ
నైజారియా రాజధాని అబూజీలో జైలు పై తీవ్రవాదులు దాడికి దిగారు. రాత్రి పది గంటల సమంయలో తీవ్రవాదులు కుజీ జైలుపై దాడి చేశారు
నైజారియా రాజధాని అబూజీలో ఒక జైలు పై తీవ్రవాదులు దాడికి దిగారు. రాత్రి పది గంటల సమంయలో తీవ్రవాదులు కుజీ జైలుపై దాడి చేశారు. పేలుడు పదార్ధాలు వినియోగించారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని హతమార్చి జైలు లోకి ప్రవేశించారు. వీరంతా బోకో హరమ్ ఇస్లామిక్ మిలిటెంట్ వ్యతిరేక ముఠాలని అధికారులు చెబుతున్నారు. వారి గ్రూపునకు చెందిన వారు ఖైదీలు ఎక్కువగా ఉండటంతో విడిపించుకుని వెళ్లేందుకు జైలుపై దాడికి తెగ పడ్డారు.
పక్కా ప్రణాళికతో...
జైలుపై పక్కా ప్రణాళికతో దాడికి తెగబడటంతో జైలు సిబ్బంది కూడా చేతులెత్తేశారు. ఈ సందర్భంగా 600 మంది ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది. అయితే వారిలో 300 మందిని తిరిగి పట్టుకున్నామని అధికారులు చెప్పారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story