Tue Nov 05 2024 13:57:08 GMT+0000 (Coordinated Universal Time)
విజృంభిస్తోన్న కరోనా.. రెండేళ్ల గరిష్ఠానికి కొత్తకేసులు
చైనాలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో
చైనా : కరోనా పుట్టినిల్లైన చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్తవేరియంట్ రూపంలో కరోనా విజృంభిస్తూ.. తొలినాళ్లలో పరిస్థితులను గుర్తుచేస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు అధికారులు. అలాగే అత్యవసర సేవలు మినహా.. మిగతా సేవలన్నింటినీ తాత్కాలికంగా ఆపివేశారు. తాజాగా.. చైనాలో రెండేళ్లలో అత్యధిక రోజువారీ కేసులు నమోదైనట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. తాజాగా 3,393 మందికి కరోనా నిర్థారణ అయిందని, ముందు రోజుతో పోలిస్తే.. కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయని తెలిపింది.
చైనాలోని 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో షాంఘైలోని స్కూళ్లను అధికారులు మూసివేశారు. అలాగే ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు. జిలిన్ సిటీలో పాక్షిక లాక్ డౌన్ ను విధించడంతో వేలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారని ఓ అధికారి చెప్పారు. ఎక్కువమందిలో లక్షణాలు కనిపించకపోవడంతో కరోనా కేసులను గుర్తించడం సవాలుగా మారిందని చెప్తున్నారు.
90 లక్షల మంది జనాభా ఉన్న చాంగ్చున్ అనే పారిశ్రామిక నగరాన్ని శుక్రవారమే లాక్ డౌన్ చేశారు. జిలిన్ లోని సిపింగ్, దున్హువా అనే చిన్న సిటీల్లో గురు, శుక్రవారాలు లాక్ డౌన్ విధించారు. రష్యా, ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న హుంచున్ సిటీలోనూ లాక్ డౌన్ అమలు చేశారు.
Next Story