Mon Dec 23 2024 07:13:34 GMT+0000 (Coordinated Universal Time)
అర్థాంతరంగా మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ మృతి
సియానాకు మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ నేర్చుకుంది. మార్చి 2023లో ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్ లో..
గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్స్ వరకూ వెళ్లిన ఓ మోడల్ అర్థాంతరంగా కన్నుమూసింది. గుర్రపు స్వారీ రూపంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యాషన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియానా వేర్ (23) ను మృత్యువు ఆమెను కబళించింది. గుర్రపు స్వారీ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దాదాపు నెలరోజులపైగా లైఫ్ సపోర్ట్ పై ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందింది. చిన్న వయసులోనే సియానా మరణించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సియానాకు మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ నేర్చుకుంది. మార్చి 2023లో ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్ లో గుర్రంపై స్వారీ చేస్తుండగా.. అకస్మాత్తుగా గుర్రం కిందపడిపోయింది. దాంతో సియానాకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఆమెను లైఫ్ సపోర్ట్ పై ఉంచి చికిత్స అందించారు. నెలరోజులైనా ఆమె శరీరం వైద్యానికి స్పందించకపోవడంతో.. వైద్యుల సూచన మేరకు లైఫ్ సపోర్ట్ ను ఆపేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిని మోడలింగ్ ఏజెన్సీ ధృవీకరించింది. సియానా తమ గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సియానా సిడ్నీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకుంది.
Next Story