Sun Dec 22 2024 21:26:59 GMT+0000 (Coordinated Universal Time)
"మినీ టైటాన్".. మిరాకల్ జరిగితే తప్ప బయటపడలేరు !
గురువారం ఉదయానికి టైటాన్‌లోని ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, కెనడా కోస్ట్‌గార్డ్
అట్లాంటిక్ మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో గల్లంతైన సబ్-మెరైన్‌లో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో నివాసం ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నేవీ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. జలాంతర్గామిని వెతకడానికి అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి.
ఓషన్‌గేట్ అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రల టైటానిక్ శకలాల సందర్శన కూడా ఒక భాగమే. దీనికోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని ఉపయోగించారు. దాని పేరు టైటాన్. ఇది కార్బన్ ఫైబర్తోని తయారైంది. న్యూఫౌండ్లాండ్ నుంచి తాజా యాత్ర మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. ఆదివారం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్‌కు దక్షిణ దిశవైపు 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్ సముద్రంలోకి వెళ్ళింది. గంటా 45 నిమిషాల్లోనే ఆ జలాంతర్గామితో సంబంధాలు తెగిపోయాయి. దీంతో టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు అమెరికా, కెనడా కోస్ట్‌గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 22 అడుగుల పొడవున్న ఆ సబ్ మెరైన్ ఆచూకీ కోసం రెండు దేశాలకు చెందిన కోస్ట్ గార్డు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతులో ఆ మినీ జలాంతర్గామి ప్రయాణించిందని అంటున్నారు.
గురువారం ఉదయానికి టైటాన్‌లోని ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, కెనడా కోస్ట్‌గార్డ్ దళాలు టైమ్ తో పోటీ పడుతూ రెస్క్యూ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో అమెరికా కోస్ట్‌గార్డులు, కెనడా సైనిక విమానాలు, ఫ్రాన్స్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలు పాల్గొన్నాయి. గాలింపు చర్యలు చేపడుతున్న కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం.. సోనార్ ద్వారా నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఓసారి వినిపిస్తున్నాయని, ఇవి జలాంతర్గామి నుంచే వస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని అమెరికా నేవీకి అందజేయడంతో ఈ డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని నౌకలను, నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టే సామాగ్రిని రంగంలో దించుతున్నారు. ఆ సబ్‌లో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. టైటాన్ సబ్మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల బరువు ఉంటుంది. 6.7 మీటర్ల పొడుగు ఉంటుంది. 96 గంటల పాటు దాంట్లో అయిదుగురు ఉండవచ్చు. సబ్‌లో 8 రోజుల పర్యటనకు రెండున్నర లక్షల డాలర్లు వసూల్ చేస్తుంటారు.
1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఈ యాత్రలో భాగంగా దాదాపు 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.
Next Story