Fri Nov 22 2024 15:34:14 GMT+0000 (Coordinated Universal Time)
Monkey Pox : ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీ పాక్స్
70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాపించి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. త్వరితగతిన మంకీ పాక్స్ విస్తరిస్తుందని పేర్కొంది
70 దేశాల్లో మంకీ పాక్స్ వ్యాపించి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. త్వరితగతిన మంకీ పాక్స్ విస్తరిస్తుందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కారణంగా ఇప్పటికే ఐదు వందల మంది చనిపోయారని తెలిపింది. అన్ని దేశలూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ ఎక్కువగా విస్తరిస్తుందని తెలిపింది.
ఆఫ్రికా దేశాల్లో...
కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన కారణంగా పరిసర ప్రాంతాల్లోనే పన్నెండు దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధికి ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్లు తక్కువగా ఉన్నాయని, మంకీ పాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆ యా దేశాలు కోరినట్లు తెలిపింది. మంకీ పాక్స్ ప్రపంచ వ్యాప్తంగా కలవర పెడుతుందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని కోరింది
Next Story