Sat Dec 21 2024 16:34:41 GMT+0000 (Coordinated Universal Time)
భారీ పేలుడు.. 100 మంది మృతి
ఈ ప్రమాదంలో మరెందరో గాయపడ్డారు. అనధికారికంగా నిర్వహిస్తున్న ముడిచమురు శుద్ధికేంద్రం వద్ద పేలుడు సంభవించింది.
నైజీరియా : నైజీరియాలోని చమురుశుద్ధి కర్మాగారంలో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరెందరో గాయపడ్డారు. అనధికారికంగా నిర్వహిస్తున్న ముడిచమురు శుద్ధికేంద్రం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చెలరేగిన మంటలు సమీపంలో ఉన్న రెండు చమురు నిల్వ ప్రాంతాలకు విస్తరించింది. అధికారుల లెక్కల ప్రకారం 100 మందికి పైగా ఈ పేలుడు ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తోంది.
మృతులు, క్షతగాత్రుల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు. చనిపోయినవారంతా అక్రమ ఆపరేటర్లేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చమురుశుద్ధి యజమాని కోసం గాలిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క యువత చమురుశుద్ధి కేంద్రాలను అక్రమంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
Next Story