Tue Nov 26 2024 15:45:43 GMT+0000 (Coordinated Universal Time)
Tatyana Ozolina మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్.. దుర్మరణం
‘రష్యాస్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్’గా పేరొందిన టట్యానా ఓజోలినా దుర్మరణం పాలైంది. ఆమె టర్కీలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. 38 ఏళ్ల ఓజోలినా ముగ్లా- బోడ్రమ్ మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఘోర ప్రమాదం సంభవించింది.
‘రష్యాస్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్’గా పేరొందిన టట్యానా ఓజోలినా దుర్మరణం పాలైంది. ఆమె టర్కీలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. 38 ఏళ్ల ఓజోలినా ముగ్లా- బోడ్రమ్ మధ్య ప్రయాణిస్తున్నప్పుడు ఘోర ప్రమాదం సంభవించింది. ది సన్ నివేదిక ప్రకారం.. ఓజోలినా తన ఎరుపు రంగు BMW S1000RR బైక్ పై నియంత్రణ కోల్పోయి మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం సంభవించిన పరిస్థితులపై అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె ఆకస్మిక మరణం పట్ల ఆండ్రీ ఇవనోవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిలియన్ల మంది ప్రజలు ఆమెను ఫాలో అయ్యారు.. ఎన్నో అవార్డులను పొందింది. ఇప్పుడు ఆమె మన మధ్య లేదు.. ఆమె జ్ఞాపకాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయని తెలిపారు. నివేదికల ప్రకారం, ఓజోలినా బైక్‌ను ఆమె గుంపులోని మరో రైడర్ ఢీకొట్టడంతో ఆమె అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. దీంతో ఆమె అనుకోని విధంగా ట్రక్కును ఢీకొట్టింది. నియంత్రణ కోల్పోయి గాయాలపాలైంది. ఆమె మెడకు గాయమైందని.. కొంత సేపటికి స్పృహలో ఉంది అయితే అంబులెన్స్ వచ్చేలోపు చనిపోయిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ఓజోలినాకు మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. టిక్‌టాక్‌లో ఐదు మిలియన్ల మంది, యూట్యూబ్‌లో రెండు మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ఒక మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, యూరప్‌లోకి ప్రవేశించడానికి తనకు అనుమతి లేదని ఆమె తెలిపింది.
Next Story