Sun Dec 22 2024 23:09:49 GMT+0000 (Coordinated Universal Time)
2023 ప్రపంచ కుబేరుల జాబితా.. 9వ స్థానంలో అంబానీ.. దిగజారిన అదానీ
గౌతమ్ అదానీ ఇటీవల తన వ్యాపార సామ్రాజ్యంలో భారీ నష్టాలు రావడంతో ఆదాయాన్ని కోల్పోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో..
2023 ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రపంచంలో అత్యంత ధనికుల జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. గతేడాది 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది 83.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ఒక స్థానం పైకి ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు. మైక్రోసాప్ట్కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్ బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముఖేష్ అంబానీ ముందు వరుసలో ఉండటం విశేషం. ఆసియాలోని ధనికుల్లో అంబానీ మొదటి స్థానంలో ఉన్నాడు.
గౌతమ్ అదానీ ఇటీవల తన వ్యాపార సామ్రాజ్యంలో భారీ నష్టాలు రావడంతో ఆదాయాన్ని కోల్పోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో 24వ స్థానానికి దిగజారాడు. ప్రస్తుతం అతని మొత్తం ఆస్తుల విలువ 47.2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని ఫోర్బ్స్ అంచనా. భారత్ లో మాత్రం అత్యంత ధనికుల్లో అదానీ రెండోస్థానంలో నిలిచాడు. 2023 ప్రపంచ కుబేరులో జాబితాలో 211 బిలియన్ డాలర్ల నికర విలువతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఎలాన్ మస్క్, 114 బిలియన్ డాలర్ల నికర విలువతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ స్థానంలో నిలిచాడు.
భారత్ లోని ధనికుల్లో అంబానీ మొదటి స్థానంలో, అదానీ రెండో స్థానంలో ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కు చెందిన శివ్ నాడార్ 25.6 బిలియన్ డాలర్ల ఆస్తితో మూడో బిలీయనీర్ గా నిలిచాడు. ఇతను ప్రపంచ కుబేరుల్లో 55వ స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 2,640 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ కు చెందిన ధనవంతులు 169 మంది ఉన్నారు.
Next Story