Mon Dec 23 2024 16:39:53 GMT+0000 (Coordinated Universal Time)
Mukesh Ambani: ముకేశ్ అంబానీతో పాకిస్థాన్ పొలిటీషియన్ ఫోటో
పాకిస్థాన్ రాజకీయ నాయకురాలు షర్మిలా ఫరూఖీతో ముఖేష్ అంబానీ
ప్యారిస్లోని డిస్నీల్యాండ్ లో పాకిస్థాన్ రాజకీయ నాయకురాలు షర్మిలా ఫరూఖీతో ముఖేష్ అంబానీ కనిపించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ తన మనవరాలిని చేతుల్లో పెట్టుకుని ఉండగా.. ఫరూఖీ, ఆమె కుటుంబంతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. షర్మిలా ఫరూఖీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు. ఆమె మాజీ వాల్ స్ట్రీట్ బ్యాంకర్ హషామ్ రియాజ్ షేక్ను వివాహం చేసుకుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ డిస్నీల్యాండ్ పారిస్ లో ముఖేష్ అంబానీతో ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలను ముగించిన తర్వాత అంబానీ కుటుంబంలోని పలువురు పారిస్లో ఉన్నారు. ముకేశ్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ రాబోయే పారిస్ ఒలింపిక్స్ కోసం అధికారిక విధులను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా భారత్ నుంచి ఆమె మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Next Story