Mon Dec 23 2024 14:12:53 GMT+0000 (Coordinated Universal Time)
నాటు నాటు పాటకు అమెరికాలో కార్ల లైటింగ్ షో.. వీడియో వైరల్
అలాగే.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. ఆ పాట కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది.
RRR సినిమా నుంచి వచ్చిన నాటు నాటు పాట.. ఆస్కార్ అవార్డును అందుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి.. అంతర్జాతీయ స్థాయికి పెరిగింది. ఇప్పుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తీసే సినిమాలపై అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. ఆ పాట కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మారుమ్రోగుతోంది. సాహిత్యానికి సంబంధించిన శబ్ద సౌందర్యం, సంగీతం, ఐకానిక్ డ్యాన్స్ స్టెప్పు భాషలకు అతీతంగా నాటు నాటు పాటను వివిధ దేశాల ప్రజలకు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి.
ఇటీవల ప్రభుదేవా కూడా 100 మందితో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి, ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరుతూ, వెలుగుతూ.. పాటకు తగ్గట్టుగా విన్యాసాలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మీరూ దానిపై ఓ లుక్కేయండి మరి.
Next Story