నేపాల్ శాంతి, సామరస్యాలను పరిరక్షించండి ప్రధాని పుష్పకమల్ దహాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబ విజ్ఞప్తి
నేపాల్ లో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ప్రజలకు ప్రధాని దహాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ లు విజ్ఞప్తి చేశారు
నేపాల్ శాంతి, సామరస్యాలను పరిరక్షించండి
ప్రధాని పుష్పకమల్ దహాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబ విజ్ఞప్తి
నేపాల్ లో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ప్రజలకు ప్రధాని దహాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ లు విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు గొడ్డు మాంసం తిన్నారని వివాదం చెలరేగిన తర్వాత నేపాల్ లోని ధరన్, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు మత సంస్థలు ఆధ్యాత్మిక ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పడంతో, ధరన్లో నిషేధ ఉత్తర్వులను అమల్లోకి తెచ్చారు. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి స్థానిక అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని నేపాల్ లోని ప్రముఖ వార్తాపత్రిక హిమాలయన్ టైమ్స్ పేర్కొంది.
సున్సారి లో రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలను, కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు జిల్లా అధికారి తెలిపారు.ధరన్లోకి వెళ్లే అన్ని ప్రవేశ మార్గాల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేసినట్లు సున్సారి సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభు ధాకల్ చెప్పారు. ధరన్ మీదుగా కోషి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఆగిపోయాయి.
ధరన్ మీదుగా వచ్చిపోయే దాదాపు అన్ని వాహనాలు నిలిచిపోయాయని ధరన్లొ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మేన్ చెప్పారు. ధరన్లో మార్కెట్ మాత్రం తెరచి ఉంది. నగరంలో టెంపోలు, బైకులు వంటి కొన్ని ప్రైవేట్ వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి. ధరన్ సిటీ ప్రవేశ ద్వారం వద్ద, ప్రధాన మార్కెట్ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతా దళాలు మోహరించినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇథారి మీదుగా ధరన్కు వచ్చే అన్ని వాహనాలను తహేరా ప్రాంతంలోనే పోలీసులు ఆపివేసి, వెనక్కి పంపిస్తున్నారని స్థానిక వ్యాపారవేత్తలు చెప్పారు.
నేపాల్ అనేక జాతుల, మతాల, కులాల సమూహమని,మతం, సంస్ర్కుతి ,సంప్రదాయం పేరుతో విద్వేషం తగదని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
రాజకీయపార్టీలు , స్థానికి నాయకులు, ధార్మిక సంస్థలు, ఆర్గనైజేషన్లు, సామాజిక వేత్తలు, కలసికట్టుగా ఉండి శాంతి సామరస్యాలను పరిరక్షించాలని నేపాల్ కాంగ్రెస్ కోరింది.