Sat Nov 23 2024 01:19:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫిఫ్త్ వేవ్ - నేటి నుంచి జనవరి 14వరకూ లాక్ డౌన్.. ఎక్కడ ?
విద్యాసంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు, ఇతర షాపులన్నింటినీ తప్పనిసరిగా
ఫిఫ్త్ వేవ్ వస్తోంది. ఒమిక్రాన్ కేసులు ఊహించని రీతిలో నమోదవుతాయని వార్తలొచ్చిన నేపథ్యంలో ఒక దేశం నేటి నుంచి జనవరి 14వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించింది. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా ? నెదర్లాండ్స్ లో. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో.. ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి జనవరి 14వ తేదీ వరకూ ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
కొన్నింటికే మినహాయింపు
శనివారం రాత్రి హేగ్ లో అత్యవసరంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ఐదో వేవ్ ప్రభావం నెదర్లాండ్స్ పై తీవ్రంగా ఉంటుందని వార్తలొచ్చిన నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం అనివార్యమైందన్నారు. ఈ లాక్ డౌన్ నుంచి సూపర్ మార్కెట్లు, ఆస్పత్రులు, వైద్య సేవలు, కార్ గ్యారేజీలు తదితర వాటికి మినహాయింపు వర్తిస్తుందన్న ఆయన.. విద్యాసంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు, ఇతర షాపులన్నింటినీ తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా..క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్ లో ఒమిక్రాన్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ హెచ్చరించారు.
పారిస్ లో బాణసంచా కార్యక్రమం రద్దు
ఇప్పటికే ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు డచ్, ఫ్రాన్స్, సైప్రస్ ఆస్ట్రియా దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను కఠినతరం చేయగా.. పారిస్ ప్రతి ఏటా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిపే బాణాసంచా కార్యక్రమాన్ని 2022 న్యూఇయర్ రోజున రద్దు చేసింది. డెన్మార్క్ లో పాక్షిక లాక్ డౌన్ కొనసాగుతోంది. సామూహిక ప్రదర్శనలు, సినిమాలు, మ్యూజియంలు, పార్కులను మూసివేశారు. మరోవైపు ఐర్లాండ్ లోనూ పబ్ లు, బార్లపై రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ విధించారు.
Next Story