Fri Nov 22 2024 15:28:37 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తరూపం దాల్చిన కరోనా.. ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్న కేసులు ?
గ్వాంగ్ డాన్ ప్రావిన్సులోని షౌగన్ పట్టణంలో బీఏ 5.1.7 కేసులను గుర్తించారు. అలాగే బీఎఫ్.7 కేసులను షౌగన్ తో పాటు..
కరోనా పుట్టినిల్లైన చైనాలో కరోనా మళ్లీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే అక్కడ కేసులు పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు. అత్యంత వేగంగా విస్తరించే గుణం ఉన్న మరో రెండు వేరియంట్లు వెలుగుచూశాయి. అవే ఒమిక్రాన్ బీఎఫ్ 7, బీఏ 5.1.7 అనే కొత్తరకాలకు అత్యంత వేగంగా విస్తరించే లక్షణాలున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రానున్న శీతాకాలంలో మళ్లీ కరోనా పెరగవచ్చని, కేసులు గణనీయంగా విభృంభించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తవేరియంట్ల కారణంగా.. వైరస్ మరిన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుందని భావిస్తున్నారు.
గ్వాంగ్ డాన్ ప్రావిన్సులోని షౌగన్ పట్టణంలో బీఏ 5.1.7 కేసులను గుర్తించారు. అలాగే బీఎఫ్.7 కేసులను షౌగన్ తో పాటు.. యాంటాయ్ పట్టణంలో గుర్తించారు. ఈ రెండు వేరియంట్లు బాధితుడి రోగ నిరోధక వ్యవస్థ కళ్లు గప్పుతాయని చైనా ప్రభుత్వం చెప్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బీఎఫ్.7 వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేసింది. రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే సామర్థ్యంతో పాటు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో.. కేసులు మరింత పెరగవచ్చని తెలుస్తోంది. కొత్త వేరియంట్ల రాకతో ఇప్పటికే తీసుకున్న కరోనా నిరోధక వ్యాక్సిన్లు పనిచేస్తాయా లేదా అన్న సందేహాలు సైతం ఉన్నాయి.
Next Story