Tue Dec 24 2024 00:52:50 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాఫ్టర్లు.. 9 మంది సైనికులు మృతి
కెంటెల్లీ రాష్ట్రంలోని ట్రిక్ కౌంటీలో పోర్ట్ క్యాంపెల్ డెల్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది అమెరికా ఆర్మీ సైనికులు..
అగ్రరాజ్యమైన అమెరికాలో ఘోరప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ ఆర్మీ హెలికాప్టర్లు కుప్పకూలాయి. కెంటెల్లీ రాష్ట్రంలోని ట్రిక్ కౌంటీలో పోర్ట్ క్యాంపెల్ డెల్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది అమెరికా ఆర్మీ సైనికులు దుర్మరణం చెందారు. శిక్షణలో భాగంగా గగనతలంలోకి ఆర్మీ హెలికాప్టర్లు వెళ్లగా.. ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు వెల్లడించారు.
అమెరికా సైన్యంలో 101 ఎయిర్ బోన్ డివిజన్ కు చెందిన రెండు హెచ్ హెచ్ 60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లలో సైనికులు శిక్షణ పొందుతుండగా అకస్మాత్తుగా రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ ట్వీట్ చేశారు. ప్రమాదం జగిన ప్రదేశంలో పోలీసులు, సహాయ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Next Story