Mon Dec 23 2024 13:36:48 GMT+0000 (Coordinated Universal Time)
Heavy Rains : భారీ వర్షాలకు 200 మందికి పైగా మృతి
భారీ వర్షాలకు 226 మంది భారీ వర్షాల కారణంగా మరణించినట్లు అధికార ప్రకటన విడుదయింది. మయన్మార్ లో ఈ విషాద ఘటన జరిగింది.
భారీ వర్షాలకు అతి భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. దాదాపు 226 మంది భారీ వర్షాల కారణంగా మరణించినట్లు అధికార ప్రకటన విడుదయింది. మయన్మార్ లో ఈ విషాద ఘటన జరిగింది. యాగీ తుపాను బీభత్సంతో ఇంతటి విపత్తు సంభవించింది. మరణించిన వారితో పాటు వందల సంఖ్యలో గల్లంతయ్యారని చెబుతున్నారు. అధికారులు మాత్రం 77 మంది గల్లంతయినట్లు తెలిపారు. ఇప్పటికే ఆరు లక్షలకు మందికి పైగా ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్షలాది మంది...
లక్షలాది మంది ఈ విపత్తుతో నష్టపోయారని చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కూడా అధికారులు చెబుతున్నారు. మూడు వందలకు పైగానే మరణించి ఉంటారని అనధికారికంగా లెక్కలువినపడుతున్నాయి. వరదలతో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వీలయినంత ప్రాణ నష్టం లేకుండా చూస్తామని వారు అంటున్నారు.
Next Story