Tue Dec 24 2024 02:27:56 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ తుఫాన్.. 24 గంటల్లో లక్షకుపైగా కొత్తకేసులు
గడిచిన 24 గంటల్లో అక్కడ లక్షకు పైగా కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. యూకే లో కొత్తగా
యూకే ను ఒమిక్రాన్ తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తే చాలు.. వాళ్లపై ఎటాక్ చేస్తోంది. కరోనా తగ్గినా.. నేనుమాత్రం తగ్గనంటున్నట్లే.. భారీగా కొత్తకేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ లక్షకు పైగా కొత్తకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. యూకే లో కొత్తగా 1,06,122 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఐరోపా దేశాల్లో బ్రిటన్ ను ఒమిక్రాన్ బాగా ప్రభావితం చేస్తోంది. వాతావరణం కూడా మరింత చల్లగా ఉండటంతో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు అధికారులు.
మిలియన్లలో కేసులు, లక్షల్లో మరణాలు
కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ మిలియన్ల మంది కరోనా బారిన పడగా.. 1,14,573 మంది కరోనాతో మరణించారు. ఒమిక్రాన్ ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ ను తీసుకోవాలంటూ యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే 30 మిలియన్ల పైగా ప్రజలు బూస్టార్ డోసులను తీసుకోగా.. ఇంకా మిలియన్ల సంఖ్యలో బూస్టర్ డోసులు తీసుకోవాల్సిన వారున్నారు. ఐదు నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం ఆమోదించారు. అలాగే బ్రిటన్ లో ఇప్పటి వరకూ 37,101 ఒమిక్రాన్ కేసులను నిర్థారించారు.
ఒమిక్రాన్ తుఫాన్ రావొచ్చు..
యూకే ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ మాట్లాడుతూ, మా COVID-19 బూస్టర్ ప్రోగ్రామ్ విపరీతమైన వేగంతో పురోగమిస్తోందన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ చికిత్సలకు ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా వైరస్ పట్ల మా జాతీయ ప్రతిస్పందనను మరింత బలోపేతం చేయడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఐరోపా ఖండంలో కోవిడ్-19 కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఒమిక్రాన్ తుఫాను ఇక్కడికి రావచ్చని, అన్నింటికీ బ్రిటన్ ప్రజలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story