Mon Nov 18 2024 23:30:28 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ తో వణుకుతున్న యూకే
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వనికిస్తుంది. ఇప్పటికే 89 దేశాల్లో ఈ వేరియంట్ చొరపడినట్లు గుర్తించారు.
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వనికిస్తుంది. ఇప్పటికే 89 దేశాల్లో ఈ వేరియంట్ చొరపడినట్లు గుర్తించారు. దీంతో అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. ప్రధానంగా యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాల్లో అత్యంత వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుంది. థర్డ్ వేవ్ గా దీనిని భావిస్తున్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను మరింత పెంచుతున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారు.
రోజుకు కేసుల సంఖ్య.....
యూకేలో ప్రస్తుతం రోజుకు 88 వేల కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 93,045 కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. లండన్ లో ఎక్కువ కేసులు నమోదవుతుండటతో అక్కడ మేయర్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. దీంతో క్రిస్మస్ తర్వాత యూకేలో రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల రాకపోకలపై యూకే ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Next Story