Sun Dec 22 2024 20:49:46 GMT+0000 (Coordinated Universal Time)
టర్కీలో భారతీయుడి గల్లంతు
మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ.. ఇప్పటికి 15 వేలపైగా ఉన్నట్లు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది.
వరుస భూకంపాలతో టర్కీ, సిరియా దేశాల్లో వేల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ.. ఇప్పటికి 15 వేలపైగా ఉన్నట్లు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధ్వంసం నేపథ్యంలో టర్కీలోని భారతీయుల క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల్లో ఒకరి ఆచూకీ దొరకడంలేదని, మరో పది మంది గ్రామీణ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు.
బెంగళూరుకి చెందిన వ్యక్తి.. బిజినెస్ ట్రిప్ లో భాగంగా ఇటీవలే టర్కీ వెళ్లారు. ఆయన ఆచూకీ ఇంకా తెలియరాలేదని విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పదిమంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని, వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. టర్కీలో భారత్ కు చెందిన 3 వేల మందికి పైగా ఉంటున్నారు. భూకంపం నేపథ్యంలో వీరి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి టర్కీలోని అదానా సిటీలో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Next Story