Mon Dec 23 2024 15:56:16 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్కార్ 2022 అవార్డులకు నామినేషన్ల ప్రకటన
ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానోత్సవం మార్చి 27న అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో గల డాల్బీ థియేటర్లో జరగనుంది. ఈ క్రమంలో నేడు
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించేందుకు ఆస్కార్ అవార్డుల ఉత్సవం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానోత్సవం మార్చి 27న అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో గల డాల్బీ థియేటర్లో జరగనుంది. ఈ క్రమంలో నేడు ఆస్కార్ -2022 కు నామినేషన్లను నేడు ప్రకటించారు. వీటిలో ద పవర్ ఆఫ్ ద డాగ్ అనే సినిమా ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయింది. అగ్రనటులైన విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్టన్ బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు.
దర్శకుల విభాగంలో సీనియర్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ఇంకా వివిధ విభాగాలకు ఖరారైన నామినేషన్ల వివరాలను నటి ట్రేసీ ఎల్లిస్ రాస్, కమెడియన్ లెస్లీ జోర్డాన్ మీడియాకు వెల్లడించారు. ఉత్తమ చిత్రం కేటగిరీలో ద పవర్ ఆఫ్ ద డాగ్ , బెల్ ఫాస్ట్, కోడా, డోంట్ లుక్ అప్, డూన్, నైట్ మేర్ అల్లీ, వెస్ట్ సైడ్ స్టోరీ, లికోరైస్ పిజ్జా, డ్రైవ్ మై కార్, కింగ్ రిచర్డ్ సినిమాలు నామినేట్ అయ్యాయి.
అలాగే ఉత్తమ నటుడు కేటగిరీలో బెనెడిక్ట్ కంబర్ బాచ్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), డెంజెల్ వాషింగ్టన్ (ద ట్రాజెడీ ఆఫ్ మాక్ బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ద రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఆండ్రూ గార్ ఫీల్డ్ (టిక్, టిక్... బూమ్) లు నామినేట్ అయ్యారు. ఉత్తమ దర్శకుడు కేటగిరీలో జేన్ కాంపియన్ (ద పవర్ ఆఫ్ ద డాగ్), పాల్ థామస్ ఆండర్సన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్ బెర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యుసుకే హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రనా (బెల్ ఫాస్ట్) నామినేట్ అయ్యారు. ఉత్తమ నటి కేటగిరీలో పెనెలోప్ క్రజ్ (పారలల్ మదర్స్), క్రిస్టెన్ స్టీవార్ట్ (స్పెన్సర్), జెస్సికా చాస్టెయిన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫాయే), నికోల్ కిడ్ మాన్ (బీయింగ్ ద రికార్డోస్), ఒలీవియా కోల్మన్ (ద లాస్ట్ డాటర్) నామినేట్ అయ్యారు.
Next Story